సినీ నటి, బీజేపీ నాయకురాలు మాధవీలత ఏడస్తూ తన ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ పెట్టారు. తాను అలా ఏడవడానికి గల కారణాన్ని ఆమె తన పోస్ట్ లో వివరించారు. " చాలా ప్రయత్నం చేశా , కానీ నేను మనిషినే.. నా ఆత్మ గౌరవం మీద జరిగిన దాడి .. నాకున్న బాధను వర్ణించే పదాలు లేవు. ప్రతి క్షణం వేదనతో నిండి ఉంది. కోపం, నిరాశ, ఆవేదన , దుఃఖం ..అన్నీ ఒకేసారి నన్ను కుదిపేస్తున్నాయి. కానీ, ఎన్నోసార్లు ఎందరో నా ఆత్మవిశ్వాసాన్ని చిదిమేయాలని ప్రయత్నం చేశారు. పదే పడే ఇవే మాటలన్నారు. నా పార్టీ ( ప్రజల) కోసం , మహిళల కోసం , హిందూ ధర్మం కోసం మాత్రమే నిస్వార్థంగా నా వంతు నేను పోరాడుతున్నాను. రూపాయి తీసుకున్నది లేదు ..ఎవరికి ద్రోహం చేసింది లేదు , మోసం చేసింది లేదు , కానీ కక్ష గట్టి మాటలంటూ ఉన్నారు. చాలా ప్రయత్నం చేశా , కానీ నేను మనిషినే …నా ఆత్మ గౌరవం మీద జరిగిన దాడి … ..నాకున్న బాధను వర్ణించే పదాలు లేవు. ప్రతి... Posted by Actress Maadhavi on Sunday, January 5, 2025 సింపతీ గేమ్ ఆడలేదు.. ఆడపిల్లగా ఎపుడు నేను సింపతీ గేమ్ ఆడలేదు. మహిళల చట్టాలను అనుకూలంగా ఉపయోగించలేదు. మగాడిలా పోరాడుతూనే ఉన్నాను .. ఈ కష్టాలను అధిగమిస్తాను. నా ధైర్యాన్ని కోల్పోను. నాకు కుటుంబం , స్నేహితులు ఉన్న సరే నా అభిమానులు , సోషల్ మీడియా లో నన్ను ఫాలో అవుతున్న ఎందరో శ్రేయోభిలాషులు ఉన్నారు ..నా బాధని మీతో పంచుకున్నందుకు…. క్షమించండి … మీ ప్రేమ అభిమానం , ఆశీర్వాదాలు నాకు శక్తిని ఇస్తాయి " అంటూ మాధవీలత తన పోస్టులో వెల్లడించారు. అంతకుముందు తనపై కామెంట్స్ చేసిన తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సారీ చెప్పడంపై ఆమె స్పందించారు. తిట్టి క్షమాపణలు చెబితే సరిపోతుందా అంటూ మాధవీలత ప్రశ్నించింది. మాధవీలత ఏడ్చిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఆమెకు అభిమానులు అండగా నిలబడుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే తాడిపత్రిలోని జేసీ పార్కులో మహిళల కోసం స్పెషల్ గా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఏర్పాటు చేశారు. దీనిపై మాధవీలత స్పందించారు. అక్కడ గంజాయి బ్యాచ్‌లు ఉంటాయని, మహిళలపై అక్కడ దాడి జరిగితే ఎవరిది బాధ్యత అంటూ ఆమె ప్రశ్నించింది. దీనిపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఘాటుగా స్పందించారు. పరుష పదజాలంతో ఆమెపై కామెంట్స్ చేశారు. ఇది కాస్త వివాదాస్పదం కావడంతో జేసీ బహిరంగంగా సారీ చెప్పారు. ఆవేశంలో అలా అన్నానని , అలా మాట్లాడటం తప్పేనని క్షమాపణలు కోరారు. Also Read :