విశాల్ హీరోగా నటించిన మదగజరాజ మూవీ 11 ఏళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకువస్తోంది. ఇందులో విశాల్ సరసన అంజలి, వరలక్ష్మి శరత్‌కుమార్ హీరోయిన్లుగా నటించారు. విజయ్ ఆంటోనీ మ్యూజిక్ అందించారు. సుందర్.సి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చెన్నైలో నిర్వహించిన ఈవెంట్ కి విశాల్ హాజరయ్యారు. వైట్ అండ్ వైట్ డ్రెస్ లుక్ లో కనిపించిన విశాల్ ను చూసిన ఫ్యాన్స్ షాకయ్యారు. ఎందుకంటే గుర్తుపట్టలేనంతగా విశాల్ మారిపోవడమే అందుకు కారణం. చాలా సన్నగా అయిపోయిన విశాల్ స్టేజ్ పైన మాట్లాడుతూ వణికిపోయాడు. దీంతో అసలు విశాల్ కు ఏమైందని ఆయన అభిమానులు ఆరా తీస్తున్నారు. తాజాగా విశాల్ హెల్త్ పై నటి ఖుష్బూ ఓ ఇంటర్వ్యూలోక్లారిటీ ఇచ్చారు. ఢిల్లీలోనే ఫుల్ ఫీవర్ ఢిల్లీలో ఉన్నప్పుడే విశాల్ కు డెంగీ ఫీవర్ వచ్చిందని ఖుష్బూ తెలిపారు. అయితే 11 ఏళ్ల తరువాత రిలీజ్ అవుతున్న మదగజరాజ మూవీ కోసం ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా ఈవెంట్‌కు వచ్చారని తెలిపారు. ఫీవర్‌తో బాధపడుతున్నప్పుడు ఈవెంట్ కు ఎందుకు వచ్చావ్ అని తాను విశాల్ ను అడిగితే.. 11 ఏళ్ల తర్వాత వస్తున్న తన మూవీ కోసం కచ్చితంగా రావాలనుకున్నానని విశాల్ అన్నారని వెల్లడించింది. 103 డిగ్రీ ఫీవర్ తో కూడా వచ్చి సినిమాను విశాల్ ప్రమోట్ చేశారని.. సినిమాపై ఆయనకున్న డెడికేషన్ అలాంటిది అని చెప్పుకొచ్చారు. టాలెంటెడ్ హీరో ఈవెంట్ అయిపోయాక తాను విశాల్ ఆసుపత్రికి తీసుకెళ్లామని.. ఇప్పుడు విశాల్ కోలుకుంటున్నారని.. ఈ విషయంలో ఎవరూ కంగారుపడాల్సిన అవసరం లేదని ఖుష్బూ స్పష్టం చేశారు. ఇక విశాల్ తో తనకున్న అనుబంధం గురించి ఖుష్బూ మాట్లాడుతూ తామిద్దరం కలిసి నటించకున్న చాలా క్లో్జ్ గా ఉంటామని వెల్లడించింది. ఓ పార్టీలో కలిసిన మేమిద్దరం.. ఆ తరువాత చాలా మంచి స్నేహితులం అయ్యామని తెలిపింది. విశాల్ నటించిన కొన్ని సినిమాలు తనకు చాలా ఇష్టమన్న ఖుష్బూ .. అతను చాలా టాలెంటెడ్ హీరో అని చెప్పుకొచ్చారు. Also Read : టిబెట్ లో మృత్యుఘోష..ఇప్పటివరకు 126మంది మృతి