Mohan Babu: హైకోర్టుకు మోహన్ బాబు!

నటుడు మోహన్ బాబు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తనకు పోలీసులు ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ మేరకు తనకు పోలీస్ భద్రత ఏర్పాటు చేయాలని పిటిషన్ లో కోరారు. మోహన్ బాబు తరఫున నగేష్ రెడ్డి, మురళి పిటిషన్ వేశారు.  

New Update
mohan babu

Mohan Babu: తెలుగు రాష్ట్రాల్లో మంచు కుటుంబంలో తండ్రి, కొడుకుల మధ్య ఘర్షణ చర్చనీయాంశమైంది. తాజాగా నటుడు మోహన్ బాబు హైకోర్టును ఆశ్రయించారు. రిపోర్టర్ పై దాడి కేసులో పోలీసులు ఇచ్చిన నోటీసులపై ఆయన హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తనకు పోలీసులు ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు. అలాగే తనకు పోలీస్ భద్రత ఏర్పాటు చేయాలని పిటిషన్ లో కోరారు. మోహన్ బాబు తరఫున నగేష్ రెడ్డి, మురళి పిటిషన్ వేశారు. 

Also Read : హాస్పిటల్ లో చేరిన మోహన్ బాబు..!

మోహన్ బాబుపై కేసు...

మోహన్ బాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం రాత్రి రిపోర్టర్ చేతిలోని లోగో లాక్కొని అతని తలపై మోహన్ బాబు బలంగా కొట్టిన విషయం తెలిసిందే. రిపోర్టర్ పై దాడి చేసినందుకు ఆయనపై BNS118 సెక్షన్ కింద షహర్ పహాడీ పీఎస్ లో కేసు నమోదు చేశారు. మోహన్ బాబు వ్యతిగత విచారణకు హాజరు కావాలని రాచకొండ సీపీ నోటీసులు పంపించారు.

Read Also :రెండు రోజులు స్కూల్స్, కాలేజీలు బంద్.. ఎందుకంటే?

మోహన్ బాబు నేరం రుజువైతే ఈ కేసులో మూడేళ్ళ జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అటు మోహన్ బాబు దాడి చేసిన రిపోర్ట్ రంజిత్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నాడు. అతని దవడపైన ఉండే జైగోమాటిక్ ఎముక మూడు చోట్లు విరిగిందని వైద్యులు నిర్థరించారు. రిపోర్ట్ కు ప్లాస్టిక్ సర్జరీ అవసరమని డాక్టర్లు సూచిస్తున్నారు. రిపోర్ట్ అయ్యప్ప మాలలో ఉన్నాడు. కాగా మోహన్ బాబు చేసిన ఈ దాడిని జర్నలిస్ట్ సంఘాలు ఖండించాయి. ఈరోజు ఈ ఘటనపై నిరసన తెలపనున్నాయి. 

Also Read : మీనాక్షి చౌదరికి శ్రీలీల షాక్.. డ్యాన్సింగ్ క్వీన్ కి అదిరిపోయే ఆఫర్

Also Read: అండర్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్టుల్లో UGC కీలక మార్పులు

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు