కృష్ణాజిల్లా గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం బుల్లెట్లు కలకలం రేపాయి. ఎయిర్ పోర్ట్ తనిఖీల్లో భాగంగా ఆర్య అనే పాసింజర్ దగ్గర రెండు బుల్లెట్లు గుర్తించారు చెకింగ్ సిబ్బంది. డిసెంబర్ 5న ఉదయం గన్నవరం నుంచి ఆర్య ఢిల్లీ వెళ్తున్నాడు. చెకింగ్ సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు ఆర్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇది కూడా చదవండి : Earthquake: కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే భూకంపం: భూగర్భ శాస్త్రవేత్త గన్నవరం సిఐ బి.వి.శివప్రసాద్ ఈ విషయం గురించి మాట్లాడారు. పోలీసుల విచారణలో ఆర్య కేఎల్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ బీటెక్ సెకండియర్ చదువుతున్నట్లు తేలింది. లైసెన్స్ లేని బులేట్లు ఆర్య దగ్గర ఉండటం చట్టరీత్య నేరమని కేసు పెట్టి, ఆర్యపై ఎఫ్ఐఆర్ చేశారు. పోలీసులు ఈకేసులో దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: Mexican Actress: మతాచారం పాటించి చనిపోయిన హీరోయిన్ హర్యానాకు చెందిన ఆర్య జూలైలో చదువు నిమిత్తం ఆంధ్రప్రదేశ్ వస్తుండగా వాళ్ల తండ్రి బ్యాగ్గు తీసుకొచ్చానని పోలీసులకు చెప్పాడు. ఆర్య తండ్రి రోతు హర్యానాలో బ్యాంకు సెక్యూరిటీ సిబ్బందిగా విధులు నిర్వహిస్తున్నాడు. అతని తండ్రి లైసెన్స్ గన్ బుల్లెట్లు బ్యాగులో ఉన్నట్లుగా ఆర్య చెప్పాడు. Also Read: కన్న తల్లిదండ్రులను, అక్కను కత్తితో పొడిచి పొడిచి.. ఎంత క్రూరంగా చంపాడంటే? ఇది కూడా చదవండి: పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం ఇష్యూ.. ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు!