ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఐదేళ్ల గడువుతో ఆయనకు పాస్‌పోర్టు మంజూరు చేయాలని అధికారులను న్యాయస్థానం ఆదేశించింది. 2024 సెప్టెంబరు 20న జగన్ పాస్‌పోర్టు గడువు ముగిసింది. దీంతో తన కుమార్తె డిగ్రీ ప్రదానోత్సవ కార్యక్రమానికి విదేశాలకు వెళ్లేందుకు పాస్‌పోర్టుకు ఎన్వోసీ (నిరభ్యంతర పత్రం) ఇచ్చేలా ఆదేశించాలన్న ఆయన విజ్ఞప్తిని విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టు తోసిపుచ్చింది. దీంతో హైకోర్టును జగన్ ఆశ్రయించగా తాజా తీర్పు వెలువడింది. పాస్‌పోర్ట్ కోసం ప్రత్యక్షంగా జగన్ హాజరుకావాలని హైకోర్టు సూచించింది. విజయవాడ ప్రత్యేక కోర్టు జగన్ విజ్ఞప్తిని తిరస్కరిస్తూ పేర్కొన్న కారణాలు చెల్లవని హైకోర్టు పేర్కొంది. కోర్టు తీర్పుతో జగన్ యూరప్ పర్యటనకు లైన్ క్లియర్ అయింది. 2025 జనవరి 16వ తేదీన యూకేలో జరగనున్న కుమార్తె డిగ్రీ పట్టా ప్రదానోత్సవ కార్యక్రమానికి హాజరు కానున్నారు. నాంపల్లి కోర్టులో పిటిషన్ మరోవైపు విదేశీ పర్యటనకు తనను అనుమతించాలని నాంపల్లి కోర్టులో వైఎస్ జగన్ వేసిన పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. . 2025 జనవరి 11వ తేదీ నుంచి 25 వరకు యూకే పర్యటనకు అనుమతి ఇవ్వాలని తన పిటిషన్ లో కోరారు జగన్. కుటుంబ సమేతంగా యూకే వెళ్లాలని పిటిషన్ లో అనుమతి కోరారు జగన్ దీనిపై విచారణ చేపట్టిన కోర్టు జగన్ పిటిషన్‌పై కౌంటర్ ధాఖలు చేయాలని సీబీఐ అధికారులను ఆదేశించింది. సీబీఐ అధికారులు కౌంటర్ ధాఖలు చేసిన అనంతరం వాదనలు జరగనున్నాయి. అక్రమాస్తుల కేసులో జగన్ నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఆయన ఎప్పుడు దేశం విడిచిపెట్టి వెళ్లాలి అనుకుంటే తప్పకుండా సీబీఐ కోర్టు పర్మిషన్ ఉండాల్సిందే. ఈ కేసులో బెయిల్ మంజూరు చేసినప్పుడు కోర్టు తమ అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదనే షరతులు పెట్టింది. దీంతో జగన్ న్యాయస్థానం అనుమతి తీసుకోవడం తప్పనిసరి. అనుమతి వచ్చిన తర్వాతే గతంలో కూడా జగన్ విదేశాలకు వెళ్లినప్పుడు కోర్టులో పిటిషన్ దాఖలు చేసి.. అనుమతి వచ్చిన తర్వాతే వెళ్లారు. గతేడాది ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాక జగన్ తన కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలకు వెళ్లారు. మే17 నుంచి జూన్1 వరకు ఆయన విదేశాల్లో పర్యటించారు. బ్రిటన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ దేశాలను ఆయన సందర్శించారు. ఇప్పుడు ఆయన మరోసారి యూకే పర్యటనకు వెళ్తున్నారు జగన్. Also Read : తెలుగు రాష్ట్రాలపై చలి పంజా.. పడిపోతున్న ఉష్ణోగ్రతలు