YS Sharmila : జగన్ కుంభకర్ణుడు.. 25 మంది ఎంపీలు గాడిదలు కాస్తున్నారా?.. ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్న షర్మిల..!

జగన్ అంటే తనకు ద్వేషం కాదని.. కేవలం సిద్ధాంతం కోసమే పోరాడుతున్నానని అన్నారు వైఎస్ షర్మిల. వైఎస్సార్ ఆశయాలను నిలబెట్టడం కోసమే కాంగ్రెస్ లో చేరానని స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్రాన్ని మోసం చేస్తుంటే దండయాత్ర చేయాల్సింది పోయి.. వంగి వంగి దండాలు పెడుతున్నారని కామెంట్స్ చేశారు.

New Update
YS Sharmila: జగన్ ఓటమిపై షర్మిల సంచలన ట్వీట్

YS Sharmila : అనకాపల్లి జిల్లా(Anakapalle District) ములగపుడి గ్రామ ప్రజలతో APCC చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి(YS Sharmila Reddy) రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జగన్(YS Jagan) అన్న అంటే తనకు ద్వేషం కాదని చెప్పుకొచ్చారు. కేవలం సిద్ధాంత పోరాటమేనన్నారు. వైఎస్సార్(YSR) ఆశయాలను జగన్ అన్న నిలబెట్టడం లేదని.. జగన్ అన్న విధానాలు వైఎస్సార్ ఆశయాలు కాదని వివరించారు.

పొరపాటే కానీ..

వైఎస్సార్ చనిపోయాక జగన్ ఆక్రమాస్తుల కేసు FIRలో వైఎస్సార్ పేరు చేర్చడం కాంగ్రెస్ పార్టీ(Congress Party) కావాలని చేసిన తప్పు కాదన్నారు. అది తెలియక చేసిన పొరపాటే కానీ.. తెలిసి చేసిన పొరపాటు కాదని తెలిపారు. సోనియా గాంధీ ఈ విషయం తనతో స్వయంగా చెప్పిందన్నారు. వైఎస్సార్ కుటుంభం అంటే గాంధీ కుటుంభానికి ఇప్పటికీ మమకారం ఉందని..వైఎస్సార్ అంటే సోనియాకి గౌరవం అని పేర్కొన్నారు. నా మనసు నమ్మింది కాబట్టే..కాంగ్రెస్ లో చేరానని స్పష్టం చేశారు. రాష్ట్రానికి, వైఎస్ కుటుంబానికి కాంగ్రెస్ ఏ మాత్రం మోసం చేయలేదని వెల్లడించారు.

Also Read : మంత్రి రోజాకు, అంబటి రాంబాబుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన పృథ్వీరాజ్.!

వ్యవసాయం దండగ..

వైఎస్సార్ ఆశయాలు సాధన అంటే జలయజ్ఞం ప్రాజెక్టులు మొత్తం పూర్తి చేయాలి కదా ?, ప్రతి ఎకరాకు సాగునీరు ఇవ్వాలి కదా ?, ఎందుకు జలయజ్ఞం ప్రాజెక్ట్ లను నిర్లక్ష్యం చేశారు? అని ప్రశ్నించారు. జగన్ అన్న ప్రభుత్వంలో వ్యవసాయం దండగా అనిపించేలా చేశాడన్నారు. గిట్టుబాటు ధర లేదు, పంట నష్ట పరిహారం లేదు, సబ్సిడీ పథకాలు పూర్తిగా ఎత్తివేశారని వ్యాఖ్యానించారు. రైతులకు ప్రయోజనం పక్కన పెట్టి వాళ్ళ భూములే కబ్జాలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఉద్యోగాలు లేక యువత కూలి పనులకు పోతున్నారన్నారు.

రాజీనామా చేసి ఉంటే..

రాష్ట్రానికి హోదా వచ్చి ఉంటే ఎన్నో పరిశ్రమలు వచ్చేవని.. ఇక్కడ 25 మంది ఎంపీలు ఉన్నారు..గాడిదలు కాస్తున్నారా? అని విమర్శలు గుప్పించారు. బీజేపీ రాష్ట్రాన్ని మోసం చేస్తుంటే.. ఒక్క రోజు కూడా ఆందోళన చేసింది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ లు రాజీనామా చేసి ఉంటే..హోదా వచ్చి ఉండేది కదా అని నిలదీశారు. బీజేపీ మీద దండయాత్ర చేయాల్సింది పోయి.. వంగి వంగి దండాలు పెడుతున్నారని ధ్వజమెత్తారు.

Also Read : Pawan Kalyan: బీ కేర్ ఫుల్.. జనసైనికులకు పార్టీ అధినేత పవన్ హెచ్చరిక..!

కుంభ కర్ణుడే..

జగన్ మోహన్ రెడ్డి ఒక కుంభ కర్ణుడని ఎద్దేవ చేశారు. ఎన్నికల ముందు ఉద్యోగాలు అని నిద్ర లేచాడని.. 25 వేల DSC ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పుడు 6 వేల పోస్టులు వేశారని మండిపడ్డారు. మద్యపాన నిషేదం చేయకపోతే ఓటు అడగను అన్నాడని..నిషేదం పక్కన పెడితే ..సర్కారే మద్యం అమ్ముతుందన్నారు. జగన్ వాగ్ధానాలు అన్ని మద్యం షాపుల్లో బ్రాండ్ పేర్లతో ఉన్నాయని పేర్కొన్నారు. కల్తీ మద్యం అమ్ముతూ జనాలను చంపుతున్నారని ఆరోపించారు. గత 10 ఏళ్లుగా రాష్ట్రానికి రావాల్సిన హక్కులు ఒక్కటి అమలు కాలేదని..రాష్ట్ర విభజన హామీలు, రాజధాని నిర్మాణం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని కామెంట్స్ చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు