అందుకే మహిళలకు విటమిన్ సి తప్పనిసరి
మహిళలకు ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవడం తప్పనిసరి. వారి జీవితంలో విటమిన్ సి ప్రముఖ పాత్ర పోషిస్తుంది.
అందుకే విటమిన్ సి ఎక్కువగా ఫుడ్స్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
రోగనిరోధక వ్యవస్థ సరైన పనితీరుకు విటమిన్ సి కీలకం. అంటువ్యాధులు, అనారోగ్యాల బారి నుంచి కాపాడుతుంది.
కొల్లాజెన్ సంశ్లేషణలో కీలక పాత్ర పోషిస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
విటమిన్ సి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతుంది.
క్యాన్సర్, గుండె జబ్బులు, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
ఐరన్ లోపం లేదా రక్తహీనతతో బాధపడుతున్న మహిళలకు ఇది చాలా అవసరం.
విటమిన్ సి ఎముకల కణాజాల నిర్మాణానికి సహాయపడుతుంది.