వేసవిలో మీ గట్ ఆరోగ్యంగా ఉండాలంటే..
ఎండలు మండుతున్నాయి. వేసవిలో స్పైసీ, స్ట్రీట్ ఫుడ్ కు దూరంగా ఉండాలి.
సీజన్ ను అనుగుణంగా ఫుడ్ తీసుకోవాలి.
వేసవిలో అతిసారం, వాంతులు, జీర్ణక్రియ సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి.
వేసవిలో గట్ ఆరోగ్యం బాగుండాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి.
డీహైడ్రేషన్ కారణంగా ఇమ్యూనిటీ తగ్గుతుంది. పానీయాలు ఎక్కువగా తీసుకోవాలి.
తులసి, నల్లమిరియాలు, ఎండు అల్లం, ఎండు ద్రాక్షలతో చేసిన హెర్బల్ టీ తాగాలి.
పెరుగులో ప్రొబయోటిక్స్ అధికంగా ఉంటాయి. ఇడ్లీ వంటి పులియబెట్టిన ఆహారాలు తినాలి.
వేసవిలో ఎక్కువగా ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. యాపిల్స్, అరటి, పచ్చికూరగాయలు తినాలి.
జంక్, స్పైసీ ఫుడ్స్ మీ పేగు ఆరోగ్యాన్ని పాడుచేస్తాయి. కొవ్వు ఎక్కువగా పదార్థాలకు దూరంగా ఉండాలి.