పరీక్షల ఒత్తిడిని తగ్గించే టిప్స్ ఇవే
చాలా మంది విద్యార్థులు పరీక్షల సమయంలో ఒత్తిడికి లోనవుతుంటారు. ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉండే చిట్కాలు చూద్దాం
ప్రశాంతమైన మనసు, శరీరం కోసం ఈ మానసిక ఆరోగ్య చిట్కాలను పాటించడం చాలా ముఖ్యం.
పరీక్షలు చాలా ఒత్తిడిని, ఆందోళనను ప్రేరేపిస్తాయి.
విశ్రాంతి తీసుకోవడానికి తగినంత విరామం ఇవ్వాలి. మెరుగైన సామర్థ్యం, మనస్సును రిలాక్స్ చేస్తుంది.
ప్రతిరోజూ 20 నిమిషాలపాటు ధ్యానం, మెడిటేషన్ చేయాలి. ఇది ఏకాగ్రతను పెంచుతుంది.
పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారం ఇవ్వాలి. వాల్నట్స్, పండ్లు, ఒమేగా పుష్కలంగా ఉండే ఫుడ్స్ అందించాలి.
సరైన నిద్ర చాలా ముఖ్యం. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది.