పోషకాలు కావాలా?ఇవి తిందాం.!

పండ్లలో రారాజుగా పిలిచే మామిడిలో విటమిన్ ఎ, సి, కె, బి ఉన్నాయి. 

ఇవి ఇమ్యూనిటీని పెంచుతాయి. మెదడును చురుగ్గా ఉంచుతాయి. క్యాన్సర్, జీర్ణ సమస్యలు రాకుండా కాపాడుతాయి. 

అవకాడోలో ఎ, బి, ఇ విటమిన్లు ఉన్నాయి. పొటాషియం, పీచు పదార్థాలు, ఖనిజాలు కూడా ఉన్నాయి. 

కంటి చూపునకు అవసరమైన బీటాకెరోటిన్ ను అధిక మోతాదులో అందిస్తుంది. 

లిచీలో విటమిన్లు, మెగ్నీషియం, రైబోఫ్లేమిన్, కాపర్, ఫాస్పరస్ వంటి పోషకాలు ఉన్నాయి. 

లిచీలోని పోషకాలు ఫ్లూ, ఇతర ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తాయి. 

నేరేడు పండ్లలో విటమిన్ ఎ, సి, ఇలతోపాటు ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు లభిస్తాయి. 

 గుండె ఆరోగ్యానికి మేలు చేసే పొటాషియం ఎక్కువగా ఉంటుంది. అజీర్తి, రక్తహీనత వంటి సమస్యలు దరిచేరవు.