ఏడు వారాల నగల గురించి మీకు తెలుసా?
మహిళలకు నగలకు దగ్గరి సంబంధం ఉంటుంది. కొంతమంది రంగురాళ్లు పెట్టుకుంటారు.
పూర్వం స్త్రీలు దేవుని అనుగ్రహం పొందేందుకు రోజుకో నగ వారం రోజులు పెట్టుకునేవారట. అందుకే ఏడువారాల నగలు అని పేరువచ్చింది.
ఏడు వారాల నగలు ధరించిన మహిళలు సంపూర్ణ ఆరోగ్యంతోపాటు అష్టైశ్వర్యాలు లభిస్తాయని నమ్మేవారు.
సూర్యభగవానుడికోసం హారాలు, కెంపులతో తయారు చేసిన జుంకాలు
చంద్రుని అనుగ్రహం కోసం ముత్యాల హారాలు, గాజులు.
కుజుని కోసం పగడాలతో తయారు చేసిన గొలుసులు, ఉంగరాలు
బుధుని అనుగ్రహం కోసం పచ్చల పతకాలు, గాజులు
బ్రుహస్పతి కోసం పుష్యరాగము
శుక్రుని కోసం వజ్రాల హారాలు, ముక్కు పుడక, గాజులు
శనిదేవుని కోసం నీలమణి హారాలు