మష్రూమ్తో మధుమేహానికి చెక్
పుట్టగొడుగులను తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలున్నాయి. కానీ వర్షాకాలంలో వీటిని దూరంగా ఉండాలి.
మష్రూమ్స్ లో ప్రొటీన్, విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, ఐరన్ వంటి పోషకాలెన్నో ఉన్నాయి. ఇవి శరీరానికి శక్తిని అందిస్తాయి.
వీటిలో ఉండే కొవ్వు, కార్బో హైడ్రేట్లు, ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.
పుట్టగొడుగుల్లో పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని పెంపొందించడంలో సహాయడపతాయి. ఇవి గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
మష్రూమ్స్ తినడం వల్ల క్యాన్సర్, అల్జీమర్స్ వంటి తీవ్రమైన ఆనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
వర్షాకాలంలో బ్యాక్టీరియా నేలపైకి వస్తుంది. తడి నేలలో పుట్టగొడుగులు పుడుతుంటాయి. ఇవి బ్యాక్టీరియా ఫంగస్ ఏర్పడుతుంది.
వర్షాకాలంలో పుట్టగొడుగులు బీజాంశాలను ఉత్పత్తి చేస్తాయి. వీటిని తింటే అలెర్జీని కలిగిస్తాయి.