దుబాయ్లో వర్ష బీభత్సం..భయానక దృశ్యాలు
దుబాయ్ లో వర్షం బీభత్సం స్రుష్టించింది. రోడ్లు, పలు ప్రాంతాలు నదులను తలపించాయి.
భారీ వర్షం కారణంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరిస్తూ రెడ్ అలర్ట్ జారీ చేశారు.
దుబాయ్ ఎయిర్ పోర్టు జలమయం కావడంతో విమానాల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది.
దుబాయ్ మెట్రో రెడ్ లైన్ సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. మెట్రోస్టేషన్లు వరద నీటిలో చిక్కుకున్నాయి.
పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, దుబాయ్ మాల్, మాల్ ఆఫ్ ఎమిరేట్స్ లోకి వరద నీరు చొచ్చుకు వచ్చింది.
ఓమన్ లో కూడా భారీ వర్షం కురిసింది. 18 మంది మరణించారు.
అబుదాబి, అల్ అయిన్ వంటి నగరాల్లో భారీ వర్షం కురిసింది.
దుబాయ్, అబుదాబి, షార్జా, ఎమిరేట్స్ లో వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.