ఉలవచారు రుచి చూశారా ఎప్పుడైనా?
ఉలవచారుతోపాటు ఉలవలతో చేసిన ఏ పదార్థంతిన్నా ఎంతో మేలు చేస్తుంది.
ఉలవలతో అధిక శక్తి వస్తుంది. ప్రొటీన్లు, కార్బొహైడ్రెట్లు, కాల్షియం,ఫైబర్ ఉన్నాయి.
ఇవి ఎదిగే పిల్లలకు మంచి పోషకాహారంగా పని చేస్తుంది.
దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడి కోలుకున్న ఉలవలతో చేసిన ఆహారం చాలా మంచిది.
ఉలవలు చాలా త్వరగా జీర్ణం అవుతాయి. ఇవి తింటే తొందరగా కోలుకుంటారు.
ఊపిరితిత్తుల్లో ఉన్న కఫాన్ని పలుచన చేసి దగ్గు, ఆస్తమావంటి అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది.
వర్షాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్లకు మంచి విరుగుడు వలే పనిచేస్తుంది.
కాలేయ సమస్యలతో ఇబ్బందిపడుతున్నవారికి ఉలవచారు మేలు చేస్తుంది.
రాత్రిపూట నానబెట్టి ఉదయం ఉడకబెట్టుకుని తినాలి.దీంతో పోషకాలు బాగా అందుతాయి.