TS: టెన్త్ పరీక్షలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

పదో తరగతి పరీక్షల మీద తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పబ్లిక్ ఎగ్జామ్స్‌లో ఇంటర్నల్ పరీక్షల ఎత్తివేత నిర్ణయాన్ని వాయిదా వేసింది. వచ్చే ఏడాది నుంచి దీన్ని అమలు చేస్తామని ప్రకటించింది. 

author-image
By Manogna alamuru
New Update
10th EXAMS: మార్చి 18 నుంచి టెన్త్ పరీక్షలు.. నేడు ప్రకటన?

10వ తరగతి పరీక్ష విధానంలో మార్పులు చేస్తూ నిన్న జారీ చేసిన ఉత్తర్వుల్లో ఈ రోజు సవరణలు చేసింది తెలంగాణ ప్రభుత్వం. 100 మార్కులతో ఎగ్జామ్ విధానాన్ని వచ్చే విద్యా సంవత్సరం (2025-26) నుండి అమలు చేయాలని డిసైడ్ అయింది.  ఈ విద్యా సంవత్సరంలో పాత విధానం 20 శాతం ఇంటర్నల్ మార్కులు.. 80 శాతం ఎగ్జామ్‌ మార్కులతోనే వెళ్ళాలని నిర్ణయించింది.  గత కొన్నేళ్ళుగా గ్రేడింగ్ పద్ధతిలో రిజల్ట్స్  ఇస్తున్నారు. అయితే తాజాగా ఈ గ్రేడింగ్ సిస్టమ్ ను ఎత్తివేసినట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటర్నల్ మార్కుల్లో అక్రమాలు జరుగుతున్నాయనే ఫిర్యాదులు రావడంతో విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. కానీ ఈరోజు మళ్ళీ ఈ నిర్ణయాన్ని మార్చుకుంది. 

exams

Advertisment
Advertisment
తాజా కథనాలు