ఉద్యోగులకు రేవంత్ సర్కార్ అదిరిపోయే శుభవార్త.. భారీగా పెరగనున్న జీతాలు! రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు, యూనివర్సిటీల్లో పని చేసే ఉద్యోగులకు రేవంత్ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. వారికి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఐఆర్ ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో వారి వేతనాలు భారీగా పెరగనున్నాయి. By Nikhil 29 Nov 2024 in తెలంగాణ Latest News In Telugu New Update షేర్ చేయండి తెలంగాణలోని రేవంత్ సర్కార్ ప్రభుత్వ రంగ సొసైటీలు, సంస్థలు, యూనివర్సిటీల ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. వారికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్ దారులకు ఇచ్చినట్లుగానే వారికి సమానంగా మధ్యంతర భృతి (IR) ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ ఉద్యోగులకు మూల వేతనంపై 5 శాతం ఐఆర్ మంజూరు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వారి వేతనాలు భారీగా పెరగనున్నాయి. దీంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శుభవార్త...రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లతో సమానంగా ప్రభుత్వ రంగ సంస్థలు, సహకార సొసైటీలు, యూనివర్సిటీ ఉద్యోగులకు ఐఆర్ (ఇంటీరిమ్ రిలీఫ్) ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం. మూల వేతనం పై 5% ఐఆర్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ. pic.twitter.com/qMrAuaFFEM — The 4th Estate (@The4thestate_tv) November 29, 2024 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి