Telangana: రేవంత్‌ సర్కార్‌లో కేటీఆర్‌ కోవర్టులు!

రేవంత్‌ సర్కార్‌లో కేటీఆర్‌ కోవర్టులు ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో తమ అభిమానులున్నారని కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలు దీనికి బలాన్ని చేకూర్చుతోంది. రేవంత్‌ రాజీనామాకు సిద్ధంగా ఉండాలని కేటీఆర్‌ చెప్పడం సంచలనంగా మారింది.

New Update
ktr warned to cm revanth

రేవంత్‌ సర్కార్‌లో కేటీఆర్‌ కోవర్టులు ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం జరిగినా తమకు తెలుస్తుందని, అన్ని విషయాలు బయటకు వస్తాయని, తప్పకుండా బయట పెడతామని రేవంత్ రెడ్డిని కేటీఆర్ హెచ్చరించారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేందుకు రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉండాలన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రేవంత్ రెడ్డి పదవిని తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని కేటీఆర్ అన్నారు. గతంలో మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప పదవి పోయినట్లే రేవంత్ రెడ్డి కూడా తన పదవిని కోల్పోతాడని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

అవినీతిని బయటకు తీసుకొస్తాం

రేవంత్ రెడ్డి బావమరిదికి అక్రమంగా టెండర్లు కట్టబెట్టిన వ్యవహారం సీఎం మెడకు చుట్టుకుంటుందని కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి ఎప్పుడు చెబుతున్న ఫోర్త్ సిటీ కాదని.. ముచ్చర్ల ఫోర్ బ్రదర్స్ సిటీ అని కేటీఆర్ ఆరోపించారు. పదేళ్లపాటు ప్రభుత్వాన్ని నడిపించిన మాకు ఎక్కడ అవినీతి జరుగుతుందో తెలియదా? అని కేటీఆర్ అన్నారు. కొడంగల్ లిఫ్ట్‌తో పాటు సీఎం కుటుంబ సభ్యుల అందరీ అవినీతిని కూడా బయటకు తీసుకొస్తామని కేటీఆర్ హెచ్చరించారు. తన బావమరిది వ్యవహారం సీఎం మెడకు అల్రెడీ చుట్టుకుందనే విషయం అతనికి తెలుసని కేటీఆర్ అన్నారు.

చిత్తశుద్ధి ఉంటే హైకోర్టు సీజే దగ్గరకు మంత్రి పొంగులేటి తనతో కలిసి రావాలని కేటీఆర్ సవాల్ విసిరారు. క్షేత్రస్థాయిలో ఎక్కడ ఏం జరుగుతున్నా, తప్పకుండా కేసీఆర్‌కు సమాచారం వస్తుందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. పదేళ్లు పాటు ప్రభుత్వాన్ని నడిపించిన కేసీఆర్‌కు కొందరు సపోర్ట్‌గా ఉన్నారనే టాక్ ఉంది. గతంలో కేసీఆర్ దగ్గర పనిచేసిన వారిని సీఎం దగ్గర, సెక్యూరిటీ, ఇతర కీలక బాధ్యతల్లో నియమించవద్దని వార్తలు వచ్చాయి. 

Advertisment
Advertisment
తాజా కథనాలు