J&K: జమ్మూ- కాశ్మీర్‌‌లో ముగిసిన రెండో విడత పోలింగ్

జమ్మూ–కాశ్మీర్‌‌లో రెండో విడత పోలింగ్ కూడా ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5గంటల వరకు 54 శాతం పోలింగ్ నమోదైంది. అక్టోబర్ 1న మూడో విడత పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 8న ఫలితాలు ప్రకటించనున్నారు.

author-image
By Manogna alamuru
New Update
polling

Assembly Elections: 

జమ్మూ–కాశ్మీర్‌‌లో పదేళ్ళ అసెంబ్లీ తర్వాత ఎన్నికలు జరుగుతున్నాయి. చివరిసారిగా అక్కడ 2014లో  ఎన్నికలు జరిగాయి. అదీకాక ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో ఇక్కడ ఎవరు గెలుస్తారనేదానిపై ఉత్కంఠత కొనసాగుతోంది. ప్రస్తుతం జమ్మూ–కాశ్మీర్ పూర్తిస్థాయి రాష్ట్రం హోదాను పొందింది. ఇక్కడ మొత్తం 90 అసెంబ్లీ స్థానాలున్నాయి. వీటికి మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇందులో సెప్టెంబర్ 18న మొదటి విడతగా 24 నియోజకవర్గాల్లో పోలింగ్‌ను నిర్వహించారు. మొత్తం 19 మంది అభ్యర్ధులు ఇందులో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.  వీటిల్లో అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు అయిన పుల్వామా లాంటివి కూడా ఉన్నాయి. మొదటి దశలో మరాజ్‌ రీజియన్‌లోని అనంత్‌నాగ్, పుల్వామా, కుల్గాం, షోపియాన్‌ , చీనాబ్‌ లోయలోని దోడా, కిష్టావర్, రాంబన్‌పాంపోర్, త్రాల్, పుల్వామా, రాజ్‌పుర, జైనాపుర, షోపియాన్, డీహెచ్‌ పుర, కుల్గాం, దేవ్‌సర్, దూరు, కోకెర్‌నాగ్, అనంత్‌నాగ్‌ వెస్ట్, అనంత్‌నాగ్, శ్రీగుఫ్వారా-బిజ్‌బెహరాలలో  జిల్లాల్లో పోలింగ్ జరిగింది. ఇక్కడ ప్రధానంగా పోటీ బీజేపీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎన్‌సీ) -కాంగ్రెస్ కూటమి, పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ (పీడీపీ) మధ్య ఉంది.

ఇక ఈరోజు జమ్మూ–కాశ్మీర్‌‌లో రెండో విడత పోలింగ్ కూడా ముగిసింది. మొత్తం 26 నియోజకర్గాల్లో మొత్తం 239 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఈ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, బీజేపీ జమ్మూ కశ్మీర్ చీఫ్ రవీందర్ రైనా, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తారిఖ్ హమీద్ కర్రా సహా పలువురు కీలక నేతలు పోటీలో ఉన్నారు. సాయంత్రం ఐదు గంల వరకు పోలింగ్ జరిగింది. రోజంతా సజావుగానే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలంగ్ ముగిసిందని ఈసీ ప్రకటించింది. 54 శాతం పోలింగ్ నమోదైందని తెలిపింది.  ఇక మూడో విడత పోలింగ్ అక్టోబర్ 1న జరగనుంది. మిగిలిన అన్ని స్థానాలకు ఇదే రోజున పోలింగ్ జరగనుంది. అన్ని అసెంబ్లీ స్థానాకు కలిపి ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 8న విడుదల కానున్నాయి.

Also Read: లడ్డూ వివాదం నేపథ్యంలో తిరుమలకు వైఎస్‌ జగన్‌

Advertisment
Advertisment
తాజా కథనాలు