Obesity: థైరాయిడ్, PCODతో పాటు ఈ సమస్యలు కూడా అధిక బరువుకు కారణం..!

నేటి బిజీ లైఫ్ స్టైల్, ఆహారపు అలవాట్లు వల్ల చాలా మందిలో ఊబకాయం సమస్య సర్వ సాధారణంగా మారింది. ముఖ్యంగా మహిళలు ఈ సమస్యకు ఎక్కువ గురవుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. మహిళల్లో థైరాయిడ్, PCOD, ఒత్తిడి వంటి ఆరోగ్య సమస్యలు ఊబకాయానికి దారితీస్తాయి.

New Update
Obesity: థైరాయిడ్, PCODతో పాటు ఈ సమస్యలు కూడా అధిక బరువుకు కారణం..!

Obesity: నేటి బిజీ లైఫ్‌లో జీవన శైలి విధానాలు, ఆహరపు అలవాట్లు వల్ల చాలా మందిలో ఊబకాయ సమస్య సర్వ సాధారణంగా మారుతోంది. ముఖ్యంగా మహిళల్లో ఊబకాయ సమస్యకు ఎక్కువగా గురవుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. కొంత మంది మహిళలు తెలియకుండానే వేగంగా బరువు పెరిగిపోతుంటారు. అలాంటి వారు అసలు బరువు పెరగడానికి కారణమేంటో కూడా అర్థం కాక ఆందోళన చెందుతారు. అయితే మహిళలు బరువు పెరగడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

థైరాయిడ్, PCOD:

కొంతమంది మహిళల్లో శరీర బరువు అకస్మాత్తుగా పెరగడానికి ఆరోగ్య సమస్యలు కూడా కారణం కావచ్చు. థైరాయిడ్ , PCOD సమస్యల వల్ల శరీరంలో హర్మోన్ల అసమతుల్యత ఏర్పడి బరువు పెరగడం ప్రారంభమవుతుంది. ఇలాంటి సమయంలో నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యున్ని సంప్రదించాలి.

ఒత్తిడి:

ఒత్తిడి కూడా శరీర బరువు పెరగడానికి కారణం. ఒత్తిడి కారణంగా శరీరంలో 'కార్టిసాల్ 'హార్మన్ పెరుగుతుంది. ఇది శరీర బరువుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది . ఇంట్లో, ఆఫీస్‌లో పని భారం ఎక్కువైనప్పుడు మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుంది. అందుకే ప్రతి ఒక్కరు రోజులో కొంత సమయాన్ని తమ కోసం కేటాయించాలి.

చెడు ఆహరపు అలవాట్లు:

చాలామంది తిండిపై శ్రద్ధ వహించరు. సమయానికి తినకపోవడం, బయట జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలతో పాటు బరువు పెరగడం ప్రారంభమవుతుంది. అంతేకాదు ఈ ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ వల్ల జీర్ణక్రియ చెడుగా ప్రభావితం అవుతుంది.

నిద్ర లేకపోవడం:

సరైన నిద్ర లేకపోవడం వల్ల బరువు కూడా పెరగడం ప్రారంభమవుతుంది. నిద్ర లేకపోవడం వల్ల శరీరంలో హర్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. దీనితో పాటు జీర్ణక్రియ మందగించి.. సమయం సందర్భం లేకుండా ఆకలి వేస్తుంది. ఇది బరువు పెరగడానికి కారణమవుతుంది.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Also Read: Ganesh Chaturthi 2024: చవితి రోజు చంద్రుడిని ఎందుకు చూడకూడదు? చూస్తే ఏం చేయాలి..? - Rtvlive.com

Advertisment
Advertisment
తాజా కథనాలు