USA: యుద్ధంతో విజయం సాధించలేము–ప్రధాని మోదీ

మానవాళి విజయం యుద్ధాలతో రాదని ప్రధాని మోదీ అన్నారు. సమష్టి శక్తిలో, ప్రపంచ శాంతిలో ఉందని ఆయన ఉద్ఘాటించారు. సుస్థిరాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూనే మానవ సంక్షేమం, ఆహారం, ఆరోగ్య భద్రత కల్పించాలని మోదీ చెప్పారు.

New Update
usa

PM Modi At UNO: 

ప్రపంచ శాంతి నేడు చాలా అవసరమని ప్రధాని మోదీ అన్నారు. భవిష్యత్తు గురించి వరల్డ్ మొత్తం చర్చిస్తున్న ఈ వేళ మానవ కేంద్రీకృత విధానాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని మోదీ చెప్పారు. మానవాళి విజయం యుద్ధాలతో రాదని ప్రధాని మోదీ అన్నారు సమిష్టి శక్తిలో, ప్రపంచ శాంతిలో ఉందని ఆయన ఉద్ఘాటించారు. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో సమ్మిటి ఆఫ్ ది ఫ్యూచర్ ను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. ఇందులో భాగంగా డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ను ప్రపంచంతో పంచుకునేందుకు భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు. సుస్థిరాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూనే మానవ సంక్షేమం, ఆహారం, ఆరోగ్య భద్రత కల్పించాలని మోదీ చెప్పారు.

ఈ సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ సకీతో మోదీ మరోసారి సమావేశమయ్యారు. రెండు దేశాల మధ్య సంబంధాలను పెంపొందించడానికి కనెక్టివిటీ, వాణిజ్యం ఇంకా సంస్కృతి వంటి రంగాలలో వేగాన్ని పెంచే మార్గాలపై చర్చించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు