Laapataa Ladies: ఆస్కార్ 2025 బరిలో ‘లాపతా లేడీస్‌'..!

కిరణ్ రావు తెరకెక్కించిన 'లాపతా లేడీస్‌' అరుదైన ఘనత సాధించింది. 2025 ఆస్కార్ అవార్డుకు ఇండియా నుంచి ఎంపికైంది. బెస్ట్ ఫారిన్ ఫిల్మ్ కేటగిరీలో ఈ చిత్రం నామినేట్ చేయబడింది. ఈ విషయాన్ని ఫిల్మ్ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా అధికారికంగా ప్రకటించింది.

New Update
Laapataa Ladies 00

Laapataa Ladies

Laapataa Ladies: బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ అమీర్ ఖాన్ మాజీ భార్య  కిరణ్ రావు తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ‘లాపతా లేడీస్‌'. స్పర్శ్ శ్రీవాత్సవ, నితాన్షి గోయెల్, ప్రతిభ ప్రధాన పాత్రల్లో ఇటీవలే విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. అయితే తాజాగా ఈ మూవీ అరుదైన ఘనత సాధించింది.  

2025 ఆస్కార్ అవార్డుకు ఎంపిక 

‘లాపతా లేడీస్‌' ఉత్తమ విదేశీ సినిమా కేటగిరీలో 2025 ఆస్కార్ అవార్డులకు ఎంపికైంది. ఈరోజు ఫిల్మ్ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా  ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. దీనిపై దర్శకురాలు కిరణ్ రావు సంతోషం వ్యక్తం చేశారు. "అకాడెమీ అవార్డ్స్‌కు భారతదేశం నుంచి అధికారిక ఎంట్రీగా మా చిత్రం లాపాటా లేడీస్ ఎంపికైనందుకు చాలా గర్వంగా, ఆనందంగా ఉందని తెలిపారు. ఈ విజయం నా మొత్తం చిత్రబృందం యొక్క  కృషికి, అంకితభావానికి  నిదర్శనం అని చెప్పారు. 

ఇటీవలే ఓ ఇంటర్వూలో పాల్గొన్న దర్శకురాలు కిరణ్ రావు కూడా ఈ ఏడాది ఆస్కార్స్ కు భారత్ నుంచి తమ సినిమా ఖచ్చితంగా  ఎంపికవుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. అయితే 'లాపతా లేడీస్' చిత్రాన్ని 2023 టోరంటో ఇంటర్ నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లోనూ ప్రదర్శించడం విశేషం. అంతే కాదు ఇండియం ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ Obviously అవార్డు వేడుకల్లో ఈ చిత్రం ఉత్తమ క్రిటిక్ ఛాయిస్ విభాగంలో  ఉత్తమ చిత్రంగా నిలిచింది. 

'లాపతా లేడీస్' స్టోరీ 

'లాపతా లేడీస్' 2001 బ్యాక్ డ్రాప్ లో రూపొందించిన కథ. ఆడవారి పట్ల సమాజం చూపించే వివక్ష.. కట్టుబాట్లు, ఆచారాలు , కుటుంబ గౌరవం అనే పేరుతో ఆడవాళ్ళు ఎలా అణచివేతకు గురవుతున్నారు అనే అంశాలను ఈ మూవీలో చాలా చక్కగా చూపించారు. ఇప్పటికీ పెళ్ళైన అమ్మాయిలు ఇంటికే పరిమితమని అనుకునే కొందరి ఆలోచన విధానాన్ని బలంగా తెరకెక్కించారు.  ఈ చిత్రానికి అమీర్ ఖాన్ నిర్మాతగా వ్యవహరించారు.  

Laapataa Ladies

Advertisment
Advertisment
తాజా కథనాలు