Tamil Nadu:జయలలిత బంగారం ఇచ్చేస్తాం..ఆరు ట్రంకు పెట్టెలు పట్టుకురండి

జయలలిత బంగారం వెనక్కి తిరిగి ఇచ్చేసేందుకు బెంగళూరు కోర్టు సిద్ధమైంది. ఇదంతా తమిళనాడు గవర్నమెంటుకే వెళ్ళనుంది. అయితే ఈ బంగారం తీసుకెళ్ళడానిక ఆరు ట్రంకు పెట్టెలను తెచ్చుకోమని కోర్టు చెప్పడంతో ఈ వార్త కాస్తా వైరల్ అయింది.

New Update
Tamil Nadu:జయలలిత బంగారం ఇచ్చేస్తాం..ఆరు ట్రంకు పెట్టెలు పట్టుకురండి

Bengaluru court:తమిళనాడు మాజీ సీఎం, సినీ నటి దివంగత జయలలితను దోషిగా తేలుస్తూ బెంగళూరు కోర్టు శిక్ష విధించింది. భారీ జరిమానాతో పాటూ 4 ఏళ్ళ జైలు శిక్ష విధించింది. ఈ శిక్ణు అనుభవిస్తూనే జయలలిత చనిపోయారు. అయితే ఆమెకు విధించిన భారీ జరిమానా మాత్రం ఇంకా కట్టకుండా ఉండిపోయింది. ఇప్పుడు ఆ భారీ జరిమానాను కూడా వసూలు చేసుకోవాలని డిసైడ్ అయింది బెంగళూరు కోర్టు. ఈ నేపథ్యంలో జయలలిత బంగారాన్ని తీసుకెళ్ళాలని తమిళనాడు ప్రభుత్వానికి చెప్పింది.

Also Read:Hyderabad: కుమారి ఆంటీ డైలాగ్స్ ఫాలో అవుతున్న హైదరాబాద్ పోలీసులు

6 ట్రంకు పెట్టెలు తెచ్చుకోండి..

అక్రమాస్తుల కేసులో 2014లో అప్పడు తమిళనాడుకు సీఎంగా ఉన్న జయలలితను దోషిగా తేల్చుకుంది బెంగళూరు కోర్టు. అప్పుడే ఆమెకు శిక్షలను కూడా వేసింది. అయితే జైలు శిక్ష అనుభవిస్తుండగా జయలలిత చనిపోయారు. దీంతో బెంగళూరు కోర్టు ఆమె దగ్గర ఉన్న బంగారం, వెండి, ఆభరణాలు, ఖరీదైన వస్తువులు అన్నీ స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు వాటిని తీసుకెళ్ళడానికే రమ్మని తమిళనాడు ప్రభుత్వానికి కబురు పెట్టింది బెంగళూరు కోర్టు. ఈ వస్తువులన్నింటితో పాటూ జయలలిత స్థిరచరాస్థులన్నింటినీ వేలం వేయడం లేదా అమ్మడం ద్వారా జరిమానా రాబట్టుకోవాలని భావిస్తోంది. ఇందులో జయలలితవి 27 కిలోల బంగారం, వెండి, ఇతర వజ్రాభరణాలు ఉన్నాయి. ఇవి పట్టుకెళ్ళాలంటే ఆరు ట్రంకు పెట్టెలైనా కావాలని కోర్టు చెప్పినట్టు తెలుస్తోంది. వీటిని వచ్చే నెల ఆరు, ఏడు తేదీల్లో తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించనున్నట్లు కోర్టు తెలిపింది. ముందు ఈ అభరణాలు వేలం వేసిన తర్వాత జయలలిత స్థిరాస్తులను కూడా వేలంలోకి తీసుకురానుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు