పవన్ కల్యాణ్‌పై పలు కేసులు, ఏయే సెక్షన్ల కింద అంటే?

ఏపీ వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలపై జనసేన అధినేత పవన్‌ని విచారణకు ప్రభుత్వం అనుమతించినట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు సచివాలయ శాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. వారాహి యాత్రలో భాగంగా.. జనసేనాని వాలంటీర్ల విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై గత కొన్నిరోజులుగా అధికార పార్టీ నాయకులు, జనసేన మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అంతేకాదు, పవన్ వ్యాఖ్యలపై ప్రభుత్వం కోర్టుకు వెళ్లాలని నిర్ణయించినట్లుగా వార్తలొచ్చాయి.

New Update
పవన్ కల్యాణ్‌పై పలు కేసులు, ఏయే సెక్షన్ల కింద అంటే?

తాజాగా.. పత్రికలు, ప్రసార మాధ్యమాల్లో వచ్చిన వార్తల ఆధారంగా పవన్‌పై కేసు నమోదుకు ఏపీ ప్రభుత్వం అనుమతినిచ్చింది. అయితే పవన్‌ చిక్కుల్లో పడటానికి కారణం... జులై 9న పవన్ మాట్లాడుతూ... ఏపీలో 29వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని, వీరిలో కొంతమందిని మాత్రమే గుర్తించారని, మిగతా వారు ఏమయ్యారో తెలియదన్నారు. వాలంటీర్లు సేకరించిన సమాచారం సంఘవిద్రోహ శక్తుల చేతుల్లోకి వెళుతోందన్నారు.

పలు సెక్షన్ల కింద కేసు నమోదు

పవన్ చేసిన ఈ వ్యాఖ్యలపై ఐసీపీ 199/4 ప్రకారం కేసు నమోదుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పవన్ పై పరువు నష్టం కేసులు పెట్టాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్లను ఆదేశిస్తూ గ్రామ, వార్డు వాలంటీర్లు, సచివాలయాల శాఖ ఆదేశాలు ఇచ్చింది. ఇందులో భాగంగా ఈరోజు జనసేన పార్టీ కార్యాలయానికి నోటీసులు ఇచ్చారు.పరువు నష్టం కేసులు పెట్టాలని చెప్పింది. గ్రామవార్డు వాలంటీర్లు, సచివాలయాల శాఖ నుంచి ఈ ఆదేశాలు వచ్చాయి. పవన్ చేసిన వ్యాఖ్యలపై వివిధ పత్రికలు, మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా కేసులు నమోదు చేయాలని చెప్పింది. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి నోటీసులు పంపారు.

విజయవాడలోని కృష్ణలంకలో కేసులు

ఏపీలో వారాహి విజయ యాత్ర నిర్వహిస్తున్న పవన్ కల్యాణ్ వాలంటీర్లపై అనేక ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఏపీలో మహిళలు అదృశ్యమవుతున్నారని పవన్ అన్నారు. వాలంటీర్లు డేటా సేకరిస్తున్నారని, అదంతా ఎవరికి చేరుతుందని ప్రశ్నించారు. ఇప్పటికే పవన్ పై కొన్ని పోలీస్ స్టేషన్లలో వాలంటీర్లు ఫిర్యాదు చేశారు. వాలంటీర్ సురేశ్ ఇటీవల చేసిన ఫిర్యాదు మేరకు విజయవాడలోని కృష్ణలంక పోలీసులు సెక్షన్ 153, 153ఏ, 505(2) ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు