Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయం కోసం రూ.52 లక్షలు విరాళం సేకరించిన 14 ఏళ్ల బాలిక.. గుజరాత్‌కు చెందిన ఓ 14 ఏళ్ల బాలిక రామమందిర నిర్మాణం కోసం రూ.52 లక్షల విరాళాలు సేకరించింది. 11 ఏళ్ల వయసప్పటి నుంచే 50 వేల కి.మీ ప్రయాణించి వివిధ ప్రాంతాల్లో 300లకు పైగా ప్రదర్శనలు ఇచ్చి వాటి నుంచి వచ్చిన సొమ్మును రామాలయ నిర్మాణం కోసం ఇచ్చేసింది. By B Aravind 22 Jan 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. రామాలయ ప్రారంభోత్సవం సంబరాలు అంబరాన్నంటాయి. ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. జై శ్రీరామ్ నినాదాలతో అయోధ్య మారుమోగిపోయింది. దేశంలోని వివిధ రంగాల ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. మరోవైపు దేశవ్యాప్తంగా ఉన్న రామాలయాల్లో ప్రజలు వేడుకలు జరుపుకుంటున్నారు. 14 ఏళ్ల బాలిక అయితే గుజరాత్‌కు చెందిన ఓ 14 ఏళ్ల బాలిక రామమందిర నిర్మాణం కోసం తనవంతు కృషి చేసింది. ఏకంగా రూ.52 లక్షల విరాళాలు సేకరించింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. సూరత్‌కు చెందిన భవికా మహేశ్వరి అనే 14 ఏళ్ల బాలిక అయోధ్యలో రాముని ఆలయాన్ని నిర్మిస్తున్నారని.. ఇందుకోసం ప్రజలు విరాళాలు కూడా ఇస్తున్నట్లు తెలుసుకుంది. దీంతో తాను కూడా విరాళాన్ని ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఆ తర్వాత బాలరాముడి కథలు చదవడం మొదలుపెట్టింది. 50 వేల కి.మీ ప్రయాణం కొవిడ్ సెంటర్లు, బహిరంగ సభల్లో ప్రజలకు రామాయణ కథలు వివరించేంది. అయితే 2021లో ఓ జైలుకి వెళ్లింది. అక్కడున్న ఖైదీలకు రాముడి కథలు చెప్పింది. దీంతో వారు ఆమెకు రూ.లక్ష విరాళంగా అందజేశారు. ఇలా భవిక 11 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచే 50 వేల కిలోమీటర్లు ప్రయాణించి వివిధ ప్రాంతాల్లో 300లకు పైగా ప్రదర్శనలు ఇచ్చింది. వీటి నుంచి మొత్తం రూ.52 లక్షలు వరకు విరాళంగా వచ్చాయి. ద్రౌపది ముర్ముపై పుస్తకం వచ్చిన ఆ సొమ్మును అయోధ్య రామాలయ నిర్మాణం కోసం ఇచ్చింది. అంతేకాదు భవికా 108కి పైగా వీడియోలు రికార్డు చేసి వీటిని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసింది. ఆ వీడియోలను కూడా ఇప్పటివరకు దాదాపు లక్ష మంది చూశారు. అలాగే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై కూడా భవిక ఓ పుస్తకాన్ని రాయడం మరో విశేషం. #telugu-news #ayodhya-ram-mandir #telangna-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి