వివస్త్రను చేసి పంచాయతీలో నిలబెట్టి..మరో దారుణ ఘటన!
బెంగాల్ లో దారుణ ఘటన జరిగింది. ఓ గిరిజన మహిళను పంచాయతీలో అందరూ చూస్తుండగా వివస్త్రను చేసి దాడికి పాల్పడ్డారు.
బెంగాల్ లో దారుణ ఘటన జరిగింది. ఓ గిరిజన మహిళను పంచాయతీలో అందరూ చూస్తుండగా వివస్త్రను చేసి దాడికి పాల్పడ్డారు.
ఇద్దరు మహిళలను కొందరు నిందితులు నగ్నంగా ఊరేగించిన ఘటన మణిపూర్లో చోటుచేసుకుంది. ఈ ఘటన మరువకముందే బెంగాల్లో ఇదే తరహా దారుణ ఘటన ఇంకొకటి చోటుచేసుకుంది. మాల్దా జిల్లాలో ఇద్దరు గిరిజన మహిళలను దారుణంగా కొట్టి.. బహిరంగంగా కొందరు గ్రామస్థులు వివస్త్రలను చేశారు. జిల్లాలోని బమంగోలా పోలీస్స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఇద్దరు బాధిత మహిళలు దొంగతనానికి పాల్పడుతున్నారన్న అనుమానంతో గ్రామస్థులు వారిని పట్టుకుని దారుణంగా కొట్టారు.