Putin: హై సెక్యూరిటీ మధ్యలో పుతిన్..మలాన్నీ ప్యాక్ చేసే భద్రతా వలయం

రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈరోజు భారత్ కు వస్తున్నారు. రెండు రోజుల పాటూ ఆయన ఇండియాలో ఉంటారు. దీని కోసం మన దేశం ఎన్ని కట్టుదిట్ట భద్రతా ఏర్పాట్లను చేసినా..ఆయన భద్రతా సిబ్బంది మాత్రం ఎప్పుడూ పుతిన్ ను చుట్టుముట్టే ఉంటారు. దీని గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..

New Update
Putin

Putin

దేశాధ్యక్షులకు ఎప్పుడూ ఐదంచెల భద్రతా ఉంటుంది. వారు ఎక్కడకు వెళ్ళినా కూడా కట్టుదిట్టమైన సెక్యూరిటీ మధ్యలోనే ఉంటారు. అయితే ఈ విషయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ మరి కాస్త ఎక్కువే అని చెప్పాలి. ఫుతిన్ చుట్టూ ఎప్పుడూ పటిష్టమైన భద్రతా వలయం ఉంటంది. 24 గంటలూ...365 రోజులూ భద్రతా సిబ్బంది ఆయనను కంటికి రెప్పలా కాపలా కాస్త ఉంటారు. ఇక విదేశాలకు వచ్చినప్పుడు అయితే ఆ రక్షణ వేరే లెవల్లో ఉంటుంది.

మలాన్ని కూడా ప్యాకింగ్..

పుతిన్ డీఎన్ఏ ఎక్కడా, ఎవరికీ దొరకకుండా ఆయన అంగరక్షకులు జాగ్రత్తలు తీసుకుంటారు. పుతిన్ వేరే దేశాలకు వెళ్ళినప్పుడల్లా ఆయన మలం, యూరిన్ ను సీలు చేసిన సంచీలలో సేకరిస్తారు. దాన్ని తరువాత మాస్కో తీసుకుని వెళతారు. 2017 నుంచి పుతిన్ ఈ పద్ధతిని అమలు పరుస్తున్నారు. రష్యా అధ్యక్షుడి ఆరోగ్యం గురించి సమాచారం శత్రువులకు అందకుండా ఉండడం కోసం దీన్ని చాలాస్ట్రిక్ట్ గా పాటిస్తారు. ట్రంప్ తో సమావేశం కోసం పుతిన్ అలస్కా వచ్చినప్పుడు కూడా ఇలాగే చేశారని చెబుతున్నారు. రష్యా అధ్యక్షుడు చుట్టూ ఆయన బాడీ గార్డులు ఉంటూనే ఉంటరు. ఆయన బాత్రూం కు వెళ్ళినా, తింటున్నా, ఎవరితో మాట్లాడుతున్నా..చివరకునిద్రపతున్నా సరే వారు అక్కడ ఉండాల్సిందే.

బాడీగార్డుల ఎంపిక..

రష్యా అధ్యక్షుడి బాడీగార్డుల ఎంపిక కూడా అత్యంత పటిష్టంగా చేస్తారు.దీని కోసం చాలా పరీక్షలు పెడతారు. బాడీగార్డుల ఎత్తు ఎత్తు 5.8 నుంచి 6.2 అడుగుల మధ్య, బరువు 75-90 కిలోల మధ్య ఉండాలి. విదేశీ భాషలు మాట్లాడగలగాలి. ఎంపిక తర్వాత కూడా కఠిన శిక్షణలు ఇస్తారు. ముఖ్యంగా బాడీగార్డులు 35 ఏళ్ళ లోపు వారే అయి ఉండాలి. ఆ వయసు దాటితే వారిని ఆ జాబ్ లో నుంచి తీసేస్తారు కూడా. పుతిన్‌కు ఎవరైనా ఎక్కువ చేరువగా వస్తే.. ఎంతటి ఉన్నత స్థాయి నేతలనైనాసరే వారు అడ్డుకుంటుంటారు.

బాడీ డబుల్, కార్లు..

ఇదొక్కటే కాదు..పుతిన్ తన లాంటి వారినే మరొకరి ఎప్పుడూ అందుబాటులో ఉంచుకుంటారు కూడా. అంటే బాడీ డబుల్ అన్నమాట. ముఖ్యంగా బహిరంగ కార్యక్రమాల్లో, ముప్పు ఎక్కువ ఉండే పరిస్థితుల్లో బాడీ డబుల్స్‌ ను ఉపయోగిస్తారు. పుతిన్ కనీసం ముగ్గురు బాడీ డబుల్స్ ను వాడుతున్నారని ఉక్రెయిన్‌ మిలిటరీ అధిపతి మేజర్‌ జనరల్‌ కిరిల్బుదనోవ్ఓసారి చెప్పారు. వేరే వ్యక్తులు అచ్చంగా పుతిన్ లా కనిపించడానికి వారికి ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయించారని తెలిపారు. ఇక ఆయన ప్రయాణించే వాహనం కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. విదేశీ పర్యటనల్లోనూ రష్యాకు చెందిన ఎన్‌ఏఎంఐ ఇన్‌స్టిట్యూట్, ఆరస్‌ మోటార్స్‌ డిజైన్‌ చేసిన ఆరస్సెనాత్‌ అనే ప్రభుత్వ కారులోనే ప్రయాణిస్తారు. ఇదొక బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనం. విదేశాలకు పుతిన్ వచ్చేటప్పుడు ఆయన విమానంతో పాటూ తో నాలుగైదు విమానాలు కూడా వసతాయి. అందులో ఆయనకు కావల్సినవన్నీ తీసుకుని వస్తారు, కారుతో సహా. ఈ కార్లు గ్రెనేడ్‌ దాడులు, అగ్నిప్రమాదాలను తట్టుకోగలవు. అత్యవసర సమయాల్లో ఆక్సిజన్‌ను సరఫరా చేసే సదుపాయం కారులో ఉంటుంది. మొత్తం నాలుగు టైర్లూపంక్చరైనా వాహనం ప్రయాణించగలదు. గంటకు 249 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు.

ప్రత్యేక విమానం, కిచెన్, చెఫ్ లు..

ఇక అధ్యక్షుడి ఆహార విషయంలోనూ చాలా జాగ్రత్తలు పాటిస్తారు. పుతిన్‌ తీసుకునే ఆహారంలో విషపదార్థాలేమైనాకలిశాయో గుర్తించేందుకు విదేశాల్లో ఆయన వెంట వ్యక్తిగత ప్రయోగశాల ఎప్పుడూ ఉంటుంది. అధ్యక్షుడు ఎప్పుడూ బయట హోటల్స్ లో ఉండరు. తన విమానంలోనే ఉంటూ తాను రష్యా నుంచి తెచ్చుకున్న చెఫ్లు, హౌస్ కీపింగ్ సిబ్బందినే వాడుకుంటారు. పుతిన్ బస చేసే స్థలాన్ని కూడా నెల రోజుల ముందు నుంచే భద్రతా సిబ్బంది అత్యాధునిక టెక్నాలజీతో తనిఖీ చేస్తారు. దాదాపుగా పుతిన్ చుట్టూ ఉన్న వారంతా సైనికులే ఉంటారు. చెఫ్, హౌస్ కీపీంగ్ లు కూడా. ఇక పుతిన్‌ ఇల్యుషిన్ఐఎల్‌-96-300 పీయూ విమానంలో ప్రయాణిస్తారు. దీన్ని ‘ఫ్లైయింగ్ప్లూటాన్‌’ అని పిలుస్తారు. అందులో జిమ్, బార్, హాస్పిటల్ వంటి సదుపాయాలు ఉంటాయి. ఈ విమానం 262 మందిని మోసుకెళ్లగలదు. ఆగకుండా 11 వేల కిలోమీటర్లు దూసుకెళ్లగలదు.

Advertisment
తాజా కథనాలు