SSMB29 Globetrotter: మహేష్ బాబు ‘గ్లోబ్‌ట్రాటర్’ ఫస్ట్ లుక్ రెడీయేనా ..? ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ!

రాజమౌళి “గ్లోబ్‌ట్రాటర్”పై ఫ్యాన్స్ ఉత్సాహం పెరుగుతోంది. ప్రియాంక చోప్రా లుక్ విడుదలయ్యాక, ఇప్పుడు మహేష్ బాబు లుక్‌ కోసం ఎదురుచూపులు మొదలయ్యాయి. నవంబర్ 15న హైదరాబాద్‌ ఆర్‌ఎఫ్‌సీ లో జరిగే ఈవెంట్‌లో ఆయన లుక్‌ విడుదలయ్యే అవకాశం ఉంది.

New Update
SSMB29 Globetrotter

SSMB29 Globetrotter

SSMB29 Globetrotter: దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి(Rajamouli), సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) కలయికలో వస్తున్న భారీ చిత్రం ‘గ్లోబ్‌ట్రాటర్’ చుట్టూ ఇప్పటికే అద్భుతమైన హైప్ నెలకొంది. ఈ సినిమా గురించి ప్రతి చిన్న అప్‌డేట్‌ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే నటుడు పృథ్విరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా జోనస్ ల ఫస్ట్ లుక్స్ విడుదల కావడంతో సోషల్ మీడియా మొత్తం సంబరంగా మారింది. ప్రియాంక చోప్రా ‘మందాకిని’ పాత్రలో కనిపిస్తూ, తన గ్లామర్ మరియు శక్తివంతమైన లుక్‌తో అందరినీ ఆకట్టుకుంది. ఆమె లుక్ విడుదలైన కొన్ని నిమిషాల్లోనే ట్రెండింగ్‌లోకి వెళ్లింది.

Mahesh Babu First Look Globetrotter

ఇప్పుడు అందరి దృష్టి మహేష్ బాబు వైపే ఉంది. ఆయన గ్లోబల్ అవతార్ ఎలా ఉండబోతుందో అన్న ఉత్సుకత ప్రతి ఫ్యాన్‌లో కనిపిస్తోంది. సమాచారం ప్రకారం మహేష్ బాబు లుక్ రేపే విడుదల కావచ్చని చెబుతున్నారు. అయితే మరికొందరు మాత్రం ఈ లుక్‌ను నవంబర్ 15న హైదరాబాద్‌లోని ఆర్‌.ఎఫ్‌.సి (రామోజీ ఫిల్మ్ సిటీ)లో జరుగనున్న ప్రత్యేక ఈవెంట్‌లో విడుదల చేస్తారని చెబుతున్నారు.

ఈ ఈవెంట్ చాలా గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. రాజమౌళి ఎప్పుడూ తన సినిమాలకు అద్భుతమైన ప్రెజెంటేషన్ ఇవ్వడంలో దిట్ట. కాబట్టి మహేష్ బాబు లుక్ ఆ ఈవెంట్‌లో ప్రత్యేకంగా ప్రదర్శించే అవకాశం ఎక్కువగా ఉంది.

సోషల్ మీడియాలో అభిమానులు ఇప్పటికే తమ అంచనాలు చెబుతూ హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ చేస్తున్నారు. “మహేష్ బాబు లుక్ ఎలా ఉంటుంది?”, “రాజమౌళి గారి ప్రెజెంటేషన్ ఏ స్థాయిలో ఉంటుంది?” అనే ప్రశ్నలు ప్రతి చోట వినిపిస్తున్నాయి.

‘గ్లోబ్‌ట్రాటర్’ మహేష్ బాబు కెరీర్‌లోనే కాదు, భారతీయ సినీ ప్రపంచంలో కూడా ఒక పెద్ద మైలురాయి అవుతుందని టాక్ వినిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా షూటింగ్ జరిగే ఈ సినిమా అడ్వెంచర్ జానర్‌లో ఉంటుందని సమాచారం.

ఇక అభిమానులకైతే ఒక్క ప్రశ్న ఉంది మహేష్ బాబు లుక్ ఎప్పుడు వస్తుంది అని? అన్ని చూస్తే, నవంబర్ 15న జరగబోయే ఈవెంట్‌లో ఆయన లుక్ బయటకు వచ్చే అవకాశం చాలా ఎక్కువ.

ఏదేమైనా, రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న ఈ గ్లోబల్ ప్రాజెక్ట్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా కౌంట్‌డౌన్ మొదలుపెట్టేశారు.

Advertisment
తాజా కథనాలు