Aghori: శ్రీకాళహస్తిలో అఘోరీకి స్పెషల్‌ ట్రీట్‌మెంట్

ఎట్టకేలకు అఘోరీ వస్త్రధారణ పాటించి శ్రీకాళహస్తి ఆలయం వద్దకు చేరుకొని స్వామి వారిని దర్శించుకున్నారు. పోలీసులు కూడా ఆమె దర్శనానికి వచ్చిన సమయంలో కొంత హడావుడి చేశారు.

New Update

ఎట్టకేలకు అఘోరీ అనుకున్నది సాధించారు. అయితే ఉదయం నుండి టెన్షన్ వాతావరణం మాత్రం అక్కడ నెలకొంది. కానీ చివరకు  అఘోరీ మాత అనుకున్నట్లే తన దర్శనం పూర్తి చేసుకున్నారు. అఘోరీ గురించి రెండు తెలుగు రాష్ట్రాలలో తెలియని వారుండరు. సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారిన అఘోరీ మాత, సికింద్రాబాద్ లోని ముత్యాలమ్మ తల్లి ఆలయంపై దాడి సమయం నుండి బాగా పాపులర్ అయ్యారు.

ఆ తర్వాత సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఆత్మార్పణం చేసుకుంటానంటూ ప్రకటించి అఘోరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతరం తెలంగాణ పోలీసులు రంగప్రవేశం చేసి, నచ్చజెప్పడం మరలా ఆ వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవడం అందరికీ తెలిసిందే. అయితే కార్తీకమాసం ప్రారంభమైన నేపథ్యంలో ఏపీలోని శైవక్షేత్రాలను అఘోరీ మాత సందర్శిస్తున్నారు. గురువారం శ్రీకాళహస్తి లో స్వామి వారిని దర్శించేందుకు వెళ్లిన ఆమెను వస్త్రధారణ పాటించాని ఆలయ సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. 

దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన అఘోరీ మాత, తన కారులోని పెట్రోల్ క్యాన్ ఓపెన్ చేసి ఆత్మార్పణకు సిద్ధమయ్యారు. స్థానికులు అడ్డుకునే లోపే  ఒక్కసారిగా, తన ఒంటిపై, కారుపై పెట్రోల్ పోశారు. పోలీసులు ఆ ప్రయత్నానికి అడ్డుతగిలి వారించారు. ఈ సందర్భంగా పోలీసులకు, అఘోరీ మాతకు కాసేపు వాగ్వివాదం జరిగింది.

ఆత్మార్పణకు సిద్ధమైన అఘోరీ మాతను అంబులెన్స్ ఎక్కించి నచ్చజెప్పటానికి ప్రయత్నించారు. తాను ఎలాగైనా శివయ్యను దర్శనం చేసుకొని ఇక్కడి నుండి కదులుతానని భీష్మించి కూర్చున్న ఆమెకు, సాయంత్రానికి పోలీసులు వస్త్రధారణ ధరించేలా ఒప్పించారు. సాయంత్రం పోలీస్ ఎస్కార్ట్ రాగా, అఘోరీ వస్త్రధారణ పాటించి శ్రీకాళహస్తి ఆలయం వద్దకు చేరుకొని స్వామి వారిని దర్శించారు. పోలీసులు కూడా ఆమె దర్శనానికి వచ్చిన సమయంలో కొంత హడావుడి చేశారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు