కూటమిలో కొట్లాట.. కొట్టుకున్న టీడీపీ, జనసేన నేతలు!

AP: ఉమ్మడి ప.గో.జిల్లా దెందులూరులో టీడీపీ, జననసేన నేతలు కొట్టుకున్నారు. పైడి చింతలపాడులో పెన్షన్లు పంపిణీ చేస్తుండగా జనసేన నేత రామకృష్ణపై టీడీపీ నేతలు దాడి చేశారు. ప్రభుత్వంలో తమకు మర్యాద లేదని జనసేన నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

New Update
TDP JANASENA

AP NDA: ఉమ్మడి ప.గో.జిల్లా దెందులూరులో కూటమిలో కొట్లాట జరిగింది. టీడీపీ, జనసేన నేతలు కొట్టుకున్నారు. జనసేన నేత రామకృష్ణపై టీడీపీ నేతలు దాడి చేశారు. పించన్ల పంపిణీలో ఇరు పార్టీ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పైడి చింతలపాడులో లబ్దిదారుల ఇంటి దగ్గరే ఇరి పార్టీల నేతలు కొట్టుకున్నారు. పించన్ల పంపిణీలో తమకు కనీసం అవకాశం ఇవ్వడం లేదని సమాచారం కూడా ఇవ్వడం లేదని జనసేన నేతల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనసేన నేతలతో టీడీపీ నేతల వాగ్వాదం జరిగింది. మాట మాట పెరిగి నేతలు కొట్టుకున్నారు. టీడీపీ నేతల దాడిలో జనసేన నేతలకు గాయాలు అయ్యాయి.

ఇటీవల ఏలూరులో....

ఏపీలో టీడీపీ, జనసేన పార్టీలు.. అధికారంలో భాగస్వామ్యులుగా ఉన్నప్పటికీ అప్పుడప్పుడూ, అక్కడక్కడా పార్టీ నేతల మధ్య విభేదాలు పొడసూపుతున్నాయి. ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో మంత్రి కందుల దుర్గేష్ ఎదుటే.. టీడీపీ, జనసేన నాయకులు ఘర్షణ పడ్డారు. నిడదవోలు మండలంలో జనసేన నేతలు తమకు అధికారిక కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం ఇవ్వడం లేదంటూ మంత్రి కందుల దుర్గేష్ సమక్షంలోనే టీడీపీ నేతలు.. జనసేన వారితో ఘర్షణకు దిగారు.

అయితే మరో నియోజకవర్గంలో టీడీపీ, జనసేన నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ నేత పెట్టిన వీడియో కూటమి నేతల మధ్య మంట పెట్టింది. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం శ్రీపర్రు గ్రామానికి చెందిన టీడీపీ నేత సైదు గోవర్ధన్ ఆదివారం ఓ వీడియో విడుదల చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సర్కారులో పవన్ కళ్యాణ్ ఉన్నారో లేదో చెప్పాలని అందులో డిమాండ్ చేశారు. కొల్లేరును నాశనం చేయాలని పవన్ కళ్యాణ్ చూస్తున్నారా అనే దానికి ఆయన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు