పేలిన టపాకాయలు.. ముక్కలు ముక్కలైన మృతదేహం!

ఏలూరులో తూర్పు వీధి గౌరీ దేవి గుడి దగ్గర స్కూటీపై టపాసులు తీసుకెళ్తున్న వ్యక్తిని బైక్ ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా టపాసులు పేలడంతో బైక్‌పై వెళుతున్న వ్యక్తి బాడీ తునాతునకలైంది. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

New Update
Tamil Nadu Blast: తమిళనాడులో భారీ పేలుడు.. ఇద్దరు మృతి

Eluru: దీపావళి పండుగ వేళ ఏలూరు జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఏలూరు తూర్పు వీధి గౌరీ దేవి గుడి దగ్గర బండిపై బాణసంచా విక్రయించడానికి  తీసుకువెళ్తుండగా పేలిన బాణసంచా సామాగ్రి పేలింది. దీంతో వాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తి ఘటన స్థలంలోనే మృతిచెందాడు. అతని శరీర భాగాలు ఎగిరి వేరువేరు చోట్ల పడ్డాయి. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయాలు పాలైన వారిని మెరుగైన చికిత్స కోసం ఏలూరు సర్వజన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

ఇది కూడా చదవండి: Diwali 2024: దీపావళికి ఇల్లంతా దీపాలు.. ఎందుకో తెలుసా? అసలు కథ ఏంటి?

ఉదయం విశాఖలో...

విశాఖ నగరానికి చెందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్ లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బ్యాంకుకు సంబంధించిన ఫైల్స్ తదితర సామాగ్రి ధ్వంసం అయినట్లు తెలుస్తోంది. తెల్లవారి 8:30 ప్రాంతంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని బ్యాంక్ అధికారులు చెబుతున్నారు. సుమారు నాలుగు ఫైర్ ఇంజన్లు 30 మంది ఫైర్ అండ్ సేఫ్టీ అధికారులు సకాలంలో వచ్చి ఈ ప్రమాద తీవ్రతను తగ్గించినట్లు అధికారులు చెప్పారు. 

ఇది కూడా చదవండి: దీపావళి రోజున ఈ మూడు వస్తువులను ఖచ్చితంగా కొనండి

మరోవైపు ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో విషాధ ఘటన చోటుచేసుకుంది. బాణసంచా తయారీ చేస్తున్న కేంద్రంపై పిడగు పడటంతో ఇద్దరు మహిళలు అక్కడిక్కడే మరణించారు. ఈ విషాధ ఘటనలో మరో 5 తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే తణుకు మండలానికి చెందిన రామశివాజీ లైసెన్సు తీసుకుని ఫైర్ వర్క్స్ నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో పిడుగు పడటంతో అందులో పనిచేస్తున్న ఇద్దరు మహిళలు మృతి చెందారు. మిగతా ఐదుగురు తీవ్రంగా గాయపడటంతో వెంటనే వారిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. 

కేరళలోనూ బాణాసంచి వల్ల..

ఇదిలా ఉండగా ఇటీవల బాణా సంచా వల్ల చాలా మంది మరణిస్తున్నారు. కేరళలోని కసర్‌గోడ్ జిల్లాలో ఓ ఆలయంలో కూడా టపాసుల కారణంగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 150 మందికి పైగా గాయపడ్డారు. నీలేశ్వరం ఆలయంలో థేయంకట్ట మహోత్సవాలు జరుగుతుండటంతో ప్రజలు చూడటానికి భారీ సంఖ్యలో వెళ్లారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు