వారిని వదిలిపెట్టొద్దు.. హోంమంత్రి అనితకు పవన్ కీలక ఆదేశాలు! ఈ రోజు డిప్యూటీ సీఎం పవన్ తో హోం మంత్రి అనిత సమావేశమయ్యారు. చిన్నారులు, మహిళలపై జరుగుతున్న నేరాల విషయంలో ప్రత్యేకంగా దృష్టి సారించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హోం మంత్రి అనితకు సూచించారు. By Nikhil 07 Nov 2024 | నవీకరించబడింది పై 07 Nov 2024 17:48 IST in ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు New Update షేర్ చేయండి చిన్నారులు, మహిళలపై జరుగుతున్న నేరాల విషయంలో ప్రత్యేకంగా దృష్టి సారించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హోం మంత్రి అనితకు సూచించారు. ఆడబిడ్డలకు అన్యాయం చేసిన వారిని చట్టప్రకారం కఠినంగా శిక్షించేలా గట్టి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ రోజు సచివాలయంలో పవన్ కల్యాణ్ తో అనిత భేటీ అయ్యారు. కొన్ని రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, హోంశాఖ తీసుకుంటున్న చర్యలను పవన్ కు వివరించారు. ఇటీవల హెం మంత్రి అనితపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాను హోం మంత్రిని అయితే పరిస్థితి వేరేలా ఉంటుందని ఆయన అనడం పొలిటికల్ సర్కిల్స్ లో తీవ్ర చర్చనీయాంశమైంది.ఇది కూడా చదవండి: మా అమ్మను నేను చంపుతానా?: విజయమ్మ కారు ప్రమాదంపై స్పందించిన జగన్ *రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కల్యాణ్ గారితో మార్యదపూర్వకంగా సమావేశమవడం జరిగింది. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు , హోంశాఖ తీసుకుంటున్న చర్యలను ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. చిన్నారులు, మహిళలపై జరుగుతున్న… pic.twitter.com/MLGmWGvevr — Anitha Vangalapudi (@Anitha_TDP) November 7, 2024 అత్యాచారాలపై పోలీసులకు పవన్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. శాంతిభద్రతలపై హోంమంత్రి అనిత సమీక్ష చేయాలన్నారు. నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్ లోనూ పవన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను ఫోన్ చేసినా కొందరు ఎస్పీలు పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు. వైసీపీ సర్కాలో వివాదాస్పదంగా వ్యవహరించిన అధికారులు ఇప్పుడు కూడా ముఖ్యమైన స్థానాల్లో ఉన్నారని పవన్ అసహనం వ్యక్తం చేశారు.ఇది కూడా చదవండి: Chandrababu-Pawan: చంద్రబాబు, పవన్, అనిత కీలక భేటీ.. అసలేం జరుగుతోంది? సోషల్ మీడియాలో ఇంకా కామెంట్లు పెడుతున్నారన్నారు. కుటుంబ సభ్యులపై పోస్టులు పెడితే చూస్తూ ఊరుకోవాలా? అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఈరోజు హోం మంత్రి అనిత పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు, తదితర అంశాలపై క్లారిటీ ఇచ్చారు. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి