మహిళలపై పోస్టులు పెడితే ఊరుకోవాలా?: కేబినెట్ మీటింగ్ లో పవన్ ఫైర్! సోషల్ మీడియా పోస్టులపై చేసిన ఫిర్యాదులను కొందరు పోలీసులు పట్టించుకోవడం లేదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫైర్ అయ్యారు. ఈ రోజు జరిగిన కేబినెట్ మీటింగ్ లో ఆయన ఈ అంశంపై సీరియస్ అయినట్లు సమాచారం. ఇంట్లో మహిళలపై పోస్టులు పెడితే ఊరుకోవాలా? అని అన్నట్లు తెలుస్తోంది. By Nikhil 06 Nov 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో పోస్టులపై ఏపీ కేబినెట్‌లో కీలక చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కొంతమంది వైసీపీ నేతలు మళ్లీ మళ్లీ పోస్టులు పెడుతున్నారని పవన్ అన్నట్లు తెలుస్తోంది. వారిపై ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోవట్లేదని అన్నట్లు సమాచారం. కావాలని కొంతమంది పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని అన్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో జగన్‌కు వత్తాసు పలికిన కొంతమంది అధికారులు ఇప్పుడు కూడా కీలక పోస్టుల్లో ఉన్నారని పవన్ అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇలా అయితే ఎలా అని పవన్ ప్రశ్నించినట్లు సమాచారం.ఇది కూడా చదవండి: అమెరికన్లకు సువర్ణ యుగం: ట్రంప్ తొలి స్పీచ్ అదుర్స్ ఫోన్ చేసినా ఎస్పీలు పట్టించుకోరా? కొంత మంది ఎస్పీలకు ఫోన్ చేసినా పట్టించుకోవడం లేదని చెప్పినట్లు సమాచారం. కింది స్థాయిలో ఉన్న డీఎస్పీలు, సీఐలపై నెపం నెడుతున్నారని అన్నట్లు తెలుస్తోంది. ఇంట్లో మహిళలపై పోస్టులు పెడితే ఊరుకోవాలా? అని ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. అందువల్లే తాను ఇటీవల కామెంట్స్ చేయాల్సి వచ్చిందని పవన్ అన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఇది కూడా చదవండి: US Election Results: ఉపాధ్యక్షుడిగా మన తెలుగింటి అల్లుడే! జగన్ సర్కార్ కారణంగానే.. అయితే పవన్‌కల్యాణ్ వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు స్పందించినట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వం వల్లే పోలీసులు ఇలా తయారయ్యారని వ్యాఖ్యానించినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అందరినీ కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉందన్నట్లు సమాచారం నెల రోజుల్లో పోలీస్ వ్యవస్థను గాడిలో పెడతానని చంద్రబాబు అన్నట్లు సమాచారం. ఇది కూడా చదవండి: Nandigam Suresh: వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు బిగ్ షాక్ ఇదిలా ఉంటే.. చాలామంది మంత్రులకు ఇంకా సీరియస్‌నెస్ రావడం లేదని సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఈ రోజు కేబినెట్ భేటీ తర్వాత మంత్రులకు ఆయన ప్రత్యేకంగా క్లాస్ తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మంత్రులతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో విమర్శలు ఎదుర్కొన్న అధికారుల తీరు ఇప్పటికీ మారలేదని బాబు అన్నట్లు తెలుస్తోంది. #chandrababu #Dy CM Pawan Kalyan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి